HYD: రామంతాపూర్ నుంచి అంబర్పేట్ వెళ్లే మార్గంలోని బ్రిడ్జి కింద “Stick No Bills-Violators Will Be Prosecuted Under NH Act” అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అదే చోట రాజకీయ నాయకుల బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీస్తోంది. నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.