KMR: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా సోమవారం లక్ష్మీదేవి గార్డెన్స్‌లో మెగారక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. కాగా SP రాజేష్ చంద్ర పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కాపాడేందుకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.