NZB: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్లో శుక్రవారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.