JN: దేవరుప్పుల మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా దందా జోరుగా కొనసాగుతుంది. దేవరుప్పుల మండల సమీపంలోని వాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ.. అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తూ ఒక్కో ట్రిప్పుకు రూ.4 వేల నుంచి 6 వేల వరకు అమ్ముతున్నారు. అధికారులు పట్టించుకోని అక్రమ ఇసుక రవాణాకు అడ్డు కట్ట వేయాలన్నారు.