WNP: జిల్లాలోని వెంగళరావు కాలనీ శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన గ్రూపు మెడిటేషన్ సత్సంగ్ కార్యక్రమంలో జర్నలిస్ట్, రచయిత గంగవరం రామకృష్ణారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకుల తరఫున ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. సమాజ హితం కోరే ఆలోచనలతో పనిచేసే వారిని గుర్తించి గౌరవించడం తమ లక్ష్యమని తెలిపారు.