WGL: నేడు జరిగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష దృష్ట్యా వరంగల్‌లోని పరీక్ష కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రకటించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ ప్రకారం గుమిగూడటం, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధించినట్లు సీపీ తెలిపారు. ప్రజలు గమనించాల్సిందిగా అన్నారు.