HNK: హన్మకొండలో నిర్వహిస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదివారం పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్బీ కళాశాల, బాలసముద్రంలోని నేషనల్ హై స్కూల్ తదితర కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు.