BHPL: జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ అభివృద్ధి అధికారి ఇందిర ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.