WGL: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 2.10 కుంభకోణం చేసిన ప్రధాన నిందితుడైన సాంబశివ రైస్ మిల్ యజమాని శ్రీనివాస్‌తో పాటు 17 మందిని అరెస్టు చేసినట్లు మంగళవారం సాయంత్రం DCP అంకిత్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాట్రపల్లి శయంపేట కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నుంచి 2.10 కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్లు వెల్లడించారూ.