ADB: నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ MLA అనిల్ జాదవ్ ఇవాళ పర్యటించారు. గ్రామానికి చెందిన కురుమే గంగారం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గంగారం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.