KMM: గ్రామపంచాయతీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమాన్ని మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో మంగళవారం కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర రూరల్ సీఐ మధు, రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి పాల్గొన్నారు.