MDK: చిలిపిచెడ్ మండలంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పోటీలో నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. డిసెంబర్ 17న ఉదయం పోలింగ్ నిర్వహిస్తామని, అదే రోజు ఫలితాలు విడుదల చేసి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.