SRCL: చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పొందటం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లను పంపిణీ చేసి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.