HYD: నవాబ్ సహబ్ కుంట డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్నామని బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని అచ్చిరెడ్డినగర్లో డ్రైనేజీ పైప్ లైన్ తదితర పనులు పరిశీలించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరగా పనులు పూర్తయితే స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు.