MNCL: రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. ఆదివారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై పోలీసులతో కలిసి ఆయన వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కాగితాలను వెంట ఉంచుకోవాలన్నారు.