RR: దేశాభివృద్ధికి ఆధ్యుడు జవహర్ లాల్ నెహ్రూ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని ఎల్ఎన్ కాలనీలో జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యం కోసం పరితపించిన ఆయన ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారన్నారు.