BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామపంచాయతీ దుబ్బ తండాలో డ్వాక్రా మహిళలకు ఇవాళ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ భూక్యా సరిత సుధాకర్ చీరలు అందజేసి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, రాబోయే రోజుల్లో డ్వాక్రా మహిళలకు పాడి పశువులను అందిస్తూ ఆర్థికంగా మహిళలను బలపరిచే దిశగా పయనిస్తుందని తెలిపారు.