NLG: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాధగోని నరేందర్ గౌడ్ అన్నారు. నల్లగొండ జిల్లాలోని ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి శిక్షణ తరగతులను సందర్శించారు. ఈ పథకం పేద కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.