SRD: మిషన్ భగీరథ లీకేజీ మరమ్మతుల కారణంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో ఈనెల 15, 16 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని 16 ట్యాంకుల నుంచి నీటి సరఫరా జరగదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.