MNCL: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎన్నికల పరిశీలకుడు మనోహర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా తాండూర్ మండలం రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. డబ్బు, మద్యం రవాణా జరగకుండా నిఘా ఉంచాలన్నారు. ఆయన వెంట MRO జ్యోత్స్న, DT పాల్గొన్నారు.