KNR: ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 75 శాతం మేర 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. వీటి విలువ రూ.544.74 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.407.21 కోట్లు జమ చేశామన్నారు. వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మిగిలిన కొనుగోళ్లను మరో 10 రోజుల్లో చేస్తామన్నారు.