ADB: స్వాతంత్య్ర సమర యోధుడు, భారతీయ సామాజిక సంస్కర్త లాహుజీ సాల్వే 231వ జయంతి వేడుకలు శుక్రవారం ఇచ్చొడ మండలంలోని ముకర కె. గ్రామంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి మహనీయులు ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, అన్నా భావు సాటే, లాహుజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహనీయులు చేసిన త్యాగాలను గ్రామస్తులు స్మరించుకున్నారు.