SDPT: సిద్దిపేట కలెక్టర్ హైమావతి, రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు జిల్లాలోని రాయపోల్, వర్గల్, గజ్వేల్, మర్కుక్, జగదేవ్ పూర్ మండలాల గుండా వెళ్తుందని తెలిపారు.