SRCL: ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ అభివృద్ధికి గ్రామస్థులు ఐక్యంగా ముందుకు వస్తున్నారు. గ్రామ సర్పంచ్ చిగురు నరేష్ పిలుపుతో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శుభ్రత, అభివృద్ధి పనుల్లో చురుకుగా పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఆదివారం శ్రమదానం కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు.