నిజామాబాద్: CM కప్ జిల్లా స్థాయి పోటీల్లో ఎల్లారెడ్డిలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. వాలీబాల్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీలో పతకాలు సాధించారు. అథ్లెటిక్స్‌లో 10 బంగారు, 3 రజత పతకాలు సాధించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ ఛైర్మన్ ఇందుప్రియ చేతుల మీదుగా క్రీడాకారులు బహుమతులు అందుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సావిత్రి తెలిపారు.