ASF:ఆసిఫాబాద్ మండలంలోని పలు గ్రామపంచాయతీల సర్పంచులు మాజీ MLA ఆత్రం సక్కును ఆదివారం కలిశారు. తమ గ్రామాల్లో CC రోడ్లు, సైడ్ డ్రైన్, కమ్యూనిటీ హాళ్లు, బోర్వెల్స్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన సక్కు గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనుల మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.