SRD: జహీరాబాద్ పట్టణంలో స్థానిక MLA మాణిక్యరావు ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు శనివారం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారిని పార్టీలోకి స్వాగతించి గులాబి కండువా కప్పారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పాలనను తెలుసుకొని తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.