MDK: కొండాపూర్ మండలం కిష్టయ్య గూడెం ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.