MBNR: భూత్పూర్ మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11:45 గంటలకు పాతముల్గర చెరువులో చేప పిల్లల విడుదల, బట్టుపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అనంతరం 3:30 గంటలకు భూత్పూర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.