MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసులు 44వ జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాదు నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఓ మారుతీ షిఫ్ట్ డిజైర్ కారులో 180 ML క్వార్టర్స్ 19 బాటిల్లు, 12 బీర్లు పట్టుకున్నారు. మద్యం సీజ్ చేసి మహబూబ్ నగర్‌కు పంపించారు. కారును బాలానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.