HYD: మణికొండలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి, పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. పశ్చిమ ప్లాజా సమీపంలో ఎలాంటి పత్రాలు లేని ఎకరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, కబ్జాదారులను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్‌లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను హైడ్రా తిరిగి తీసుకుంది.