JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని పలు ఫర్టీలైజర్ షాపులను ఇవాళ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా తనిఖీ చేశారు. యాసంగీ సీజన్లో రైతులకు, ఎరువులు, యూరియా సరఫరా పంపిణీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.