PDPL: ఓదెల మండలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకొని బోనాలు, పట్నాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.