VKB: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు సుభాష్ నగర్ కాలనీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. స్థానిక కౌన్సిలర్ కడియాల వేణుగోపాల్ చొరవతో మున్సిపల్ సిబ్బంది నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. మురుగు నీరు నిలవకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తుండటంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.