MDK: కొల్చారం మండల కేంద్రంలో వీవోఏల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్త వీవోఏ జేఏసీ పిలుపు మేరకు వారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కనీస వేతనం, హెచ్ఐర్ పాలసీ అమలు చేయాలని కోరారు. ఎన్నేళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.