JGL: ఎండపెల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన అరిగెల రవి, పోగుల చంద్రయ్య, అరిగెల శ్రీనివాస్ కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి గడ్డి కట్టలు అందజేశారు. ఈ మేరకు ఆదివారం 75 గడ్డి కట్టలను రాజన్న ఆలయ గోశాల ఇంఛార్జ్ వెంకటేష్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా వీరిని గోశాల నిర్వాహకులు అభినందించారు.