HYD: ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బెట్టింగ్ రాయుళ్లకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే కాక, తెలుగు రాష్ట్రాల అంతటా గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రూ. వేల నుంచి రూ. లక్షల వరకు పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్లో, మరికొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేలపై చాటింగ్ చేస్తున్నారు.