NLG: తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ నేతృత్వంలో రోడ్లు, రైల్వేలు, విమానయానం, లాజిస్టిక్స్, ఆరోగ్యం, డిజిటల్ ఇన్ఫ్రా ఇతర అన్ని రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేయడం ద్వారా ‘కనెక్టెడ్ తెలంగాణ’ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.