NLG: కట్టంగూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి కావడానికి ఓటర్లు సహకరించాలని ఎస్సై మునుగోటి రవీందర్ కోరారు. పిట్టంపల్లి గ్రామంలో ఆదివారం ఓటర్లకు అవగాహన కల్పించిన ఆయన, ఎలాంటి ఒత్తిళ్లకు, భయాందోళనలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.