SDPT: కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి, వారి బతుకులకు భరోసా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఎమ్మెల్యే హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరమన్నారు. పండిన పంటకు ధర రాక అప్పులు తీర్చే దారి లేక చనిపోతున్నట్లు వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రభుత్వ మోసాలకు నిలయమన్నారు.