WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కోసం ర్యాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, సత్య శారదల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.