NRML: జిల్లా స్థాయి అండర్ 17 బాల, బాలికల క్రికెట్ జట్టు ఎంపికలను ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు లక్కీ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్ గౌడ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, జనన సర్టిఫికేట్, ఆధార్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.