PDPL: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల కారణంగా ఏర్పడుతున్న సమస్యల నేపథ్యంలో మంత్రి పొంగులేటి ప్రకటనతో ఆశలు చిగురించగా, హుస్నాబాద్ తదితర మండలాలను కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.