GDWL: తెలంగాణలో ఉద్యమాల ఉక్కు పిడికిలి అని జార్జిరెడ్డిని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ గౌడ్ అభివర్ణించాడు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాడిన జార్జిరెడ్డి ఆశయసాధనకు విద్యార్థులు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చాడు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో జరిగిన జార్జిరెడ్డి PDSU వార్షికోత్సవం నిర్వహించారు.