BDK: భద్రాద్రి జిల్లాలో జనజాతీయ గౌరవ్ దివాస్ 2025 సందర్భంగా ఈ నెల 13న 131 ఆది సేవా కేంద్రాలలో గ్రామసభలు నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. ఈ జన్ సున్వాయి సెషన్లో గ్రామాల మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా స్పందనలపై చర్చిస్తారు. నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా జాతీయ వేడుకలు ఉంటాయన్నారు.