KMM: కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్మాణంలో ఉన్న గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించడంతో ఫ్యాక్టరీ ట్రయల్ రన్‌ను జనవరి 2026లో ప్రారంభించాలన్నారు. 2 షిఫ్టుల్లో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీతో 200 మందికి ప్రత్యక్షంగా, 700 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.