MBNR: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్ ఆదివారం మంత్రి క్వార్టర్స్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్ర కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా నుండి ఒక బీసీకి మంత్రి పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం అని వెల్లడించారు. దీనికి జిల్లా బీసీలమంతా రుణపడి ఉన్నామని పేర్కొన్నారు.