WNP: పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జయన్నను వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి మంగళవారం అభినందించారు. జయన్న మంచితనం వల్లే ప్రజలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఇలాంటి ఏకాభిప్రాయం ప్రతి గ్రామంలోనూ రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జయన్న గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.