ADB: ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతం కావడం అత్యవసరమని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు.