PDPL: గోదావరిఖని వన్ఎన్ పీఎస్ హోంగార్డ్ బుట్టి శ్రీనివాస్ (51) శుక్రవారం రాత్రి అకాల మరణం చెందగా శనివారం ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్నియాలను సేకరించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు. డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేష్, సీఐ ఇంద్రసేనా రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు.